ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు సంచలన లేఖ రాసింది. నీటి పంపకాల వినియోగంపై హెచ్చరించింది. తెలుగురాష్ట్రాల్లో నిర్మిస్తోన్న పలు అనుమతి లేని ప్రాజెక్టులపై అభ్యంతరం తెలిపింది. ఇష్టానుసారంగా ప్రాజెక్టులు నిర్మిస్తే నీళ్లపై అధికారాలు రాబోవని స్పష్టం చేసింది. రెండు రాష్ట్రాలు సమన్వయంతో నీళ్లను వాడుకోవాలని పేర్కొంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం (2014), కేంద్ర జలశక్తి శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం.. కృష్ణా నదిపై చేపట్టే ఏ ప్రాజెక్టుకైనా ముందుగా DPR సమర్పించాలని తెలిపింది.

