ప్రపంచ వ్యవహారాల్లో భారత్ చురుకైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని, ప్రస్తుతం ఒక సైడ్ ప్లేయర్గా మారిపోవడం ఆందోళన కలిగిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. బుధవారం చికాగో విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో పాల్గొన్న ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడుతూ అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చల్లో పాకిస్థాన్ కీలక పాత్ర పోషిస్తుండగా, ఆ దేశాలతో సంబంధాలు ఉన్నప్పటికీ భారత్ కేవలం చూస్తూ ఉండిపోవడం ఆశ్చర్యానికి గురిచేసిందని ఆయన పేర్కొన్నారు. భారత్ తన పరిమాణానికి తగ్గట్టుగా ప్రపంచ వేదికపై తన గళాన్ని వినిపించాలని స్పష్టం చేశారు.