తెలంగాణ మలి దశ ఉద్యమంలో కిరోసిన్ పోసుకుని హరీశ్ రావు డ్రామాలు ఆడారని విమర్శించారు. కానీ, శ్రీకాంతాచారి మాత్రం పెట్రోల్ పోసుకుని అమరుడయ్యాడని గుర్తు చేశారు. కేసీఆర్ పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఆయన తల్లి శంకరమ్మకు ఎందుకు ఒక్క పదవి కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శంకరమ్మను స్టేజీపైకి పిలిపించగా.. ముఖ్యమంత్రి మాట్లాడుతున్నంత సేపు ఆమె కంటనీరు పెట్టారు. కల్వకుంట్ల కుటుంబంలో ఒక్కొక్కరు రూ.వేల కోట్ల ఆస్తులు, ఫాంహౌస్ లు సంపాదించుకున్నారని సీఎం రేవంత్ విమర్శించారు.