తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన పెట్టుబడుల రహస్య సమాచారం ఆంధ్రప్రదేశ్ (AP) ప్రభుత్వానికి చేరిందన్న వార్త రాజకీయ, పారిశ్రామిక వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే వెల్లడించిన కథనం ప్రకారం.. తమిళనాడు ప్రభుత్వానికి చెందిన పెట్టుబడుల ప్రోత్సాహక సంస్థ నుంచి కీలకమైన సమాచారం బయటకు లీకైనట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన తమిళనాడు ప్రభుత్వం సుమారు 15 మంది అధికారులను విధుల నుంచి తొలగించినట్లు కథనంలో పేర్కొంది

