శ్రీ చైతన్య, నారాయణ విద్యాసంస్థలకు హరీశ్ రావు పాలు అమ్ముకుంటూ దోపిడీ చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ముకుంద డెయిరీ కంపెనీని కబ్జా చేసి.. లాక్కుని పాల దోపిడీకి తెగబడినట్లు వివరించారు. అలాంటి వ్యక్తి తనపై మాట్లాడమేంటన్నారు. ఆసుపత్రులు, విద్యాసంస్థలకు హరీశ్ రావు బయట కంటే ఎక్కువ ధరలకు పాలు అమ్ముకుంటున్నాడని విమర్శించారు. ఇవి కాకుండా, హరీశ్ రావు భార్యకు మెయినాబాద్ ఫాంహౌస్, రంగనాయక్ సాగర్ పక్కన ఫాంహౌస్, ఆయన మామకు 130 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా పట్టా చేయించుకున్నారని ఆరోపించారు.

