ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ఆర్థిక సేవల దిగ్గజాలు వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ సంస్థలపై సైబర్ దాడులు కలకలం రేపుతున్నాయి. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో తమకు సేవలు అందిస్తున్న థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్లపై సైబర్ దాడి జరిగినట్లు వీసా సంస్థ అధికారికంగా ధృవీకరించింది. లక్షలాది మంది కస్టమర్ల వ్యక్తిగత సమాచారం లీక్ అయినట్లు తెలుస్తోంది.అయితే, ఈ దాడి వల్ల తమ ప్రధాన చెల్లింపుల వ్యవస్థకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని, కస్టమర్ల ఆర్థిక లావాదేవీలు సురక్షితంగానే ఉన్నాయని స్పష్టం చేసింది.