ఏపీలో 659 మండల ప్రజాపరిషత్లకు గాను 601 చోట్ల ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలు పూర్తయ్యాయని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) తెలిపింది. 58 మండల ప్రజాపరిషత్లలో పెండింగ్లో ఉన్నట్లు పేర్కొంది. పెండింగ్ స్థానాల్లో శుక్రవారం ఉదయం 11 గంటలకు ఎలక్షన్స్ జరుగుతాయని వివరించింది. మన్యం, విశాఖ, కోనసీమ, తూ.గో, ప. గో, ఎన్టీఆర్, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలు పూర్తయ్యాయని ఎస్ఈసీ వివరించింది.