కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రాసిన ఆత్మకథ పుస్తకంలో హిందుత్వ సిద్ధాంతకర్త వీర్ సావర్కర్, మరాఠీ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించేలా ఉన్నాయని శివసేన పార్టీ ఆరోపించింది. ఈ మేరకు ముంబైలో బుధవారం ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన నేతలు పుస్తకంలోని 201, 443 పేజీలు చింపేసి నిరసన ప్రదర్శించారు. పుస్తక ప్రచురణకర్త హార్పర్‌కాలిన్స్ వెంటనే వివాదాస్పద భాగాలను తొలగించాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు మహారాష్ట్రలో పుస్తక పంపిణీని నిలిపివేయాలని హెచ్చరించారు.