కోల్ కతా నైట్ రైడర్స్ సహ యజమాని జయ్ మెహతా తన సగం వాటాను విక్రయించినట్లు వార్తలు వస్తున్నాయి. జూహీ చావ్లా భర్త అయిన జయ్ మెహతాకు 45 శాతం వాటా ఉంది. షారుక్ ఖాను 55 శాతం వాటా ఉంది. జయ్ తన 45శాతంలో 22.5 శాతం వాటాను అమెరికాకు చెందిన అరెస్ మేనేజ్మెంట్ కు 400 లియన్ డాలర్ల (దాదాపుగా రూ.3,737 కోట్లు)కు విక్రయించినట్లు సమాచారం. కేకేఆర్ మొత్తం విలువ రూ. 16,634 కోట్లుగా ఇటీవల ఓ సంస్థ నిర్ణయించింది.