అలస్కాలోని ఉట్కియాగ్విక్ టౌన్ లో అక్కడి కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 1:42 నిమిషాలకు సూర్యోదయమైంది సరిగ్గా గంట తర్వాత సూర్యుడు అస్తమించాడు. ఈ ఏడాదికి అక్కడి ప్రజలకు ఇదే చిట్టచివరి సూర్యోదయం, సూర్యాస్తమయం కూడా. ఇక మళ్లీ అక్కడ జనవరి 22 లేదా 23 తేదీల్లో మాత్రమే సూర్యుడు ఉదయిస్తాడు. ఆర్కిటిక్ సర్కిల్ పైన ఉండే భౌగోళిక ప్రాంతాల్లో ప్రతి ఏటా శీతాకాలంలో భూమి తన భ్రమణ అక్షం చుట్టూ 23.5 డిగ్రీల కోణంలో వంగి ఉండడమే సూర్యకాంతి రహిత వాతావరణానికి ప్రధాన కారణం.