loader

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన క్రిమియా (కెర్చ్) వంతెనపై ఉక్రెయిన్ దాడి చేసినట్లు ప్రకటించింది. ఈ దాడిలో వంతెనలోని ప్రధాన భాగం తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. వంతెన నిర్మాణానికి సంబంధించిన కొన్ని భాగాలు కూలిపోయిన దృశ్యాలు వీడియోల్లో కనిపిస్తున్నాయని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ దాడిని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ అపూర్వ ఆపరేషన్‌గా అభివర్ణించారు. వారాలపాటు ప్రణాళిక రూపొందించి, ఉక్రెయిన్ భద్రతా సంస్థలతో పాటు ఇతర బలగాల సమన్వయంతో చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON