ఆఫ్రికా దేశంలోని మడగాస్కర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లడంతో 11 మంది చనిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. వాయువ్య మడగాస్కర్‌లోని ఆంట్సోహిహీ ప్రాంతం నుంచి రాజధాని అంటాననరివో కు ప్రయాణికులతో ఓ బస్సు బయలుదేరింది. మార్గమధ్యంలో బస్సులో అదుపుతప్పి 20 అడుగుల లోతుగల లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక అధికారులు, అత్యవసర సహాయక బృందాలు ఘటనా స్థలానికి చెరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.