ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరిగిన ఆసియాన్ సదస్సులో భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలతో కూడిన క్వాడ్ కూటమి ఒక నిర్మాణాత్మక, విశ్వసనీయ భాగస్వామ్యమని ఆయన కొనియాడారు. సముద్ర భద్రత, నమ్మకమైన సరఫరా గొలుసులు, కొత్త సాంకేతికతలు, విపత్తు నిర్వహణ రంగాల్లో QUAD ఎన్నో విశ్వసనీయ పరిష్కారాలను అందిస్తోందని ప్రధాని వివరించారు. రెండేళ్ల విరామం తర్వాత జరిగిన ఈ సదస్సు తదుపరి దశ సహకారానికి స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశిస్తుందని ధీమా వ్యక్తం చేశారు