హైదరాబాద్ మహానగరంలో దాదాపు పదకొండేళ్ల తర్వాత ఐమాక్స్ సందడి చేయనుంది. ఇక సినిమాలకు అడ్డాగా ఉన్న ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని ఐకానిక్ సుదర్శన్ 70ఎంఎం థియేటర్ స్థలంలో భారీ ప్రాజెక్టు ఏషియన్ సినిమాస్, మహేష్ బాబు, వెంకటేశ్ భాగస్వామ్యంతో నిర్మాణమవుతోంది. ఇందులో మొత్తం ఏడు స్క్రీన్స్, ఒక ఐమాక్స్ విత్ లేజర్ స్క్రీన్, ఒక 4 డీఎక్స్ స్క్రీన్ తో పాటు మరో ఐదు సాధారణ స్క్రీన్లు ఉండనున్నట్లు సమాచారం. డిసెంబర్ 18 న ఈ మల్టీప్లెక్స్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.