ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 26వ తేదీన సెలవు ప్రకటించింది. 23 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో ఈ సెలవు వర్తించనుంది. ఆ రోజున ఎన్నికలు జరిగే కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో సెలవులు ఇచ్చింది. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు స్థానిక ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు, ప్రైవేట్ సంస్థల ఉద్యోగులకు ఈ సెలవు ప్రకటిస్తున్నట్లు ఉత్తర్వుల్లో జారీ చేసింది. ప్రతీఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.