అమెజాన్ సంస్థ భారీ పెట్టుబడి ప్రకటించింది. 2030 నాటికి భారత్‌లో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల్లో 7 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించింది. భారత కరెన్సీలో సుమారు రూ.65 వేల కోట్లు పెట్టుబడిగా పెట్టనుంది. దీనిద్వారా తన పునరుత్పాదక ఇంధన పోర్ట్‌ఫోలియోను గణనీయంగా విస్తరించడంతో పాటు, సుస్థిరమైన ఇంధన భద్రతవైపు భారత్ వేస్తున్న అడుగులకు తోడ్పాటు అందించనున్నామని అమెజాన్ వెల్లడించింది.