ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో ఓ శకం ముగిసింది. దిగ్గజ కెప్టెన్, లెజెండరీ వికెట్ కీపర్ బ్యాటర్ మహేంద్ర సింగ్ ధోని ఈ టీ20 లీగ్‌కు వీడ్కోలు పలికాడు. చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన ‘తలా’.. ఐపీఎల్-2027 సీజన్ నుంచి జట్టు మార్గదర్శిగా కొత్త బాధ్యతల్లో తలమునకలు కానున్నాడు.రిటైర్మెంట్‌పై ‘మై హర్ ఏక్ పల్ కా షాయర్ హూ’ అంటూ సాగే ఐకానిక్ పాటతో కూడిన వీడియోను 45 ఏళ్ల ధోని షేర్ చేశాడు.