డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తీవ్ర కలకలం రేపిన ఓఎన్జీసీ గ్యాస్ బావి ప్రమాదం ఎట్టకేలకు అదుపులోకి వచ్చింది. పది గంటలుగా టెన్షన్ అనంతరం కోనసీమ ఊపిరి పీల్చుకుంది. సుదీర్ఘంగా పది గంటల పాటు సాగిన ఈ రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం కావడంతో పెద్ద ముప్పు తప్పినట్లయింది. మంటలు పూర్తిగా ఆరిపోవడంతో పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనల నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉందని, ఎలాంటి గ్యాస్ లీకేజీ లేదని ఓఎన్జీసీ అధికారులు స్పష్టం చేశారు.

