CSK కెప్టెన్గా ధోనీ సాధించిన విజయాలు ఐపీఎల్ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి. అతడి నాయకత్వంలో చెన్నై జట్టు 2010, 2011, 2018, 2021, 2023 సంవత్సరాల్లో ఐపీఎల్ టైటిళ్లు గెలుచుకుంది. దీంతో ఐదు ట్రోఫీలు అందించిన కెప్టెన్గా నిలిచాడు.అత్యధిక ఐపీఎల్ టైటిళ్లు సాధించిన జట్లలో సీఎస్కేను నిలిపాడు. అంతేకాదు, 2010, 2014లో ఛాంపియన్స్ లీగ్ టీ20 టైటిళ్లను కూడా చెన్నై గెలుచుకుంది. ధోనీ కెప్టెన్సీలో సీఎస్కే ఏకంగా పదిసార్లు ఐపీఎల్ ఫైనల్కు చేరడం విశేషం.