వైకాపానేత, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని పోలీసులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. పరామర్శల పేరుతో వైకాపా నేతల హడావిడి వల్ల గుంటూరు జైలు వద్ద ఇబ్బందులు తలెత్తాయి. దీంతో.. అప్పిరెడ్డిని మరో కేంద్ర కారాగారానికి మార్చాలని కోరుతూ స్థానిక 1వ అదనపు జూనియర్ సివిల్ కోర్టులో సోమవారం గుంటూరు జైలు సూపరింటెండెంట్ పిటిషన్ దాఖలు చేశారు. అప్పిరెడ్డిని పరామర్శించేందుకు పెద్దసంఖ్యలో నేతలు వస్తున్నారని, ఇది జైలు పరిపాలనకు తీవ్ర ఇబ్బందికరంగా మారిందన్నారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం జైలుకు తరలించారు.