తెలంగాణలో కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ను తక్షణమే వాయిదా వేయాలని 400 మందికి పైగా పౌర సమాజ నేతలు, మేధావులు, విద్యావేత్తలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని 365 మండలాల్లో కరువు ఛాయలు అలుముకుని ప్రజలు గుక్కెడు తాగునీటి కోసం అల్లాడుతుంటే, సమ్మిట్ పేరుతో 4 వేల మంది అతిథులకు ఫైవ్ స్టార్ విలాసాలు కల్పించడం ఏంటని వారు ప్రశ్నించారు.