తిరుమల శ్రీ వెంకటేశ్వర ఆలయంలో వేద మంత్రోచ్ఛారణ నడుమ పుష్పయాగం అత్యంత వైభవోపేతంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామికి సువాసనలు వెదజల్లే 16 రకాల పుష్పాలు, ఆరు రకాల పత్రాలతో అర్చకులు పుష్పార్చన నిర్వహించారు. మహోత్సవంలో ఉత్సవ మూర్తులకు నూతన పట్టు వస్త్రాలను సమర్పించారు. చామంతి, సంపంగి, రోజా, గన్నేరు, మల్లెలు, కనకాంబరం, తామర, మాను సంపంగి, ఇతర పుష్పాలు, తులసి, మరువం, దవణం, బిల్వం, పన్నీరు, కదిరిపచ్చ పత్రాలతో స్వామి, అమ్మవార్లను అర్చించారు. ఈ సందర్భంగా వేదాలను పఠించారు.

