మొయినాబాద్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గుండు వాణి ఇంటితో పాటు ఎనిమిది ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాల్లో రెండు ఓపెన్ ప్లాట్లు, అత్తాపూర్లో ఒక ఇల్లు, మరో జీ+2 భవనం,వ్యవసాయ భూములు గుర్తించారు. అదే విధంగా రూ.5.47 లక్షల నగదు, రూ.50 లక్షల విలువైన పెట్టుబడులు, రూ.1.30 కోట్ల షేర్లు, బ్యాంకు ఖాతాల్లో రూ.7.97 లక్షల నిల్వలు, 175.1 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు కార్లు, రెండు బైకులు గుర్తించారు. మొత్తం ఆస్తుల విలువను రూ.6.76 కోట్లుగా అంచనా వేశారు.