ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసిన వ్యవహారంలో తనకు ఏ సంబంధం లేకపోయినా పోలీసులతో కలిసి జనసేన నాయకురాలు, సంస్థ డైరెక్టర్‌తో పాటు కేకే తనను ఇరికించారని ఆ సంస్థలో పని చేసిన బోడపాటి ధరణి సెల్ఫీ వీడియోలు విడుదల చేశారు. స్టేషన్‌కు తీసుకెళ్లిన దగ్గర నుంచి నిజం చెప్పాలంటూ నన్ను కొడుతూనే ఉన్నారు. మా అమ్మా వాళ్లతో మాట్లాడతానన్నా ఒప్పుకోలేదు. తనకు ఏదైనా జరిగితే మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ సీఐ, ఎస్సైలదే బాధ్యత అని తెలిపారు.