ఏపీలో గ్రామ పంచాయతీ రెండో దశ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండో దశలో 4,960 సర్పంచులు, 49,224 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 21న నామినేషన్ల పరిశీలన, 23న అప్పీళ్ల పరిష్కారం, 24న నామినేషన్ల ఉపసంహరణ, 29న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం ఫలితాలను వెల్లడించనున్నారు.