ఇటలీకి చెందిన వామపక్ష పిఇసి నాయకుడు జియోకోమో ఫిల్బెక్ హైదరాబాద్‌లో జరిగిన భారత్ సమ్మిట్‌లో ‘ఓట్ చోర్ గద్దీ చోడ్’ అని వ్యాఖ్యానించడం దుమారం రేపుతోంది. భారత అంతర్గత వ్యవహారాల్లో విదేశీ రాజకీయ నాయకులు జోక్యం చేసుకొనేలా రాహుల్ గాంధీ పురిగొల్పుతున్నారని బిజెపి తీవ్ర ఆరోపణలు చేసింది. వ్యాఖ్యలు చేయడాన్ని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తప్పుపట్టారు. ‘‘భారత్‌ను అవమానించినప్పుడు ఎవరైనా నవ్వడం మీరు చూశారా..? నేను అడిగేది.. భారత్‌ను అవమానించేందుకు విదేశాలకు వెళ్లే వ్యక్తి గురించి కాదు’’ అని పేర్కొన్నారు.