రాష్ట్రంలో రెండో దశ పురపాలక సంఘాల ఎన్నికలకు నగారా మోగింది. ఈ నేపథ్యంలో కూటమిలోని పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం ఆదివారం ఒక కొలిక్కి వచ్చింది. బీజేపీకి ఓ కార్పొరేషన్‌తోపాటు రెండు మున్సిపాలిటీలు ఇవ్వాలని టీడీపీ నిర్ణయించింది. దీంతో రాజమండ్రి కార్పొరేషన్, కావలి, బాపట్ల మున్సిపాలిటీలను ఆ పార్టీకి కేటాయించింది. రాజమండ్రి మేయర్ అభ్యర్థిగా రేలంగి శ్రీదేవి, కావలి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా గుండ్లపల్లి భరత్ కుమార్, బాపట్ల మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ఇస్క సునీల్ కుమార్‌లను బీజేపీ ఎంపిక చేసింది.