అంతరిక్ష పరిశోధనల చరిత్రలో ఎలాన్ మస్క్ స్పేస్ఎక్స్ మరో మైలురాయిని అధిగమించింది. కక్ష్యలోకి ప్రయాణించి భూమికి తిరిగి వచ్చిన స్టార్‌షిప్ రాకెట్ పైభాగాన్ని (అప్పర్ స్టేజ్), తమ ప్రయోగ కేంద్రంలోని భారీ చాప్‌స్టిక్స్ సహాయంతో విజయవంతంగా క్యాచ్ చేశారు. ఒక కక్ష్య ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న తర్వాత, స్టార్‌షిప్ ఎగువ దశను తిరిగి లాంచింగ్ ప్యాడ్ వద్దే సురక్షితంగా పట్టుకోవడం ఇదే తొలిసారి. స్టార్‌షిప్ ఫ్లైట్ 15లో భాగంగా ‘షిప్ 42’ నవంబర్ 14న నింగిలోకి దూసుకెళ్లింది.