ఆంధ్రప్రదేశ్ లో 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల సమరం వేడెక్కింది. నామినేషన్ల ప్రక్రియలో భాగంగా నేడు రెండో రోజు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. తొలి రోజు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 274 నామినేషన్లు దాఖలు కాగా, ఇందులో మేయర్, చైర్పర్సన్ స్థానాలకు 16, వార్డు సభ్యుల స్థానాలకు 258 నామినేషన్లు అందినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
నామినేషన్ల స్వీకరణకు రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే గడువు ఉండటంతో రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల వద్ద సందడి నెలకొంది.