మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బౌరంపేట బొడ్రాయి సమీపంలో పార్క్ చేసి ఉంచిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సులన్నీ పక్కపక్కనే పార్క్ చేసి ఉండటంతో మంటలు వేగంగా ఒకదాని నుంచి మరొకదానికి వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఇప్పటికే మూడు బస్సులు పూర్తిగా కాలిబూడిదవగా, మంటలు మరో రెండు వాహనాలకు కూడా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.