పల్నాడు జిల్లాలో ఇటీవల వచ్చిన మురుసు తుపాను వల్ల జరిగిన నష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వ బృందం శనివారం చిలకలూరిపేటకు వచ్చింది. హోం శాఖ సంయుక్త కార్యదర్శి చిత్తరంజన్ దాస్ నేతృత్వంలో వచ్చిన ఈ బృందం కలెక్టర్ కృతిక శుక్లాతో సమావేశమై జిల్లాలో జరిగిన నష్టంపై అన్నిశాఖల అధికారుల నుంచి వివరాలుతెలుసుకున్నారు. ,బొప్పూడి, యడ్లపాడు, నాదెండ్ల మండలాల్లోరైతులతో మాట్లాడారు. జిల్లాలో ప్రాథమిక అంచనా ప్రకారం రూ. 70 కోట్లకు పైగా నష్టం జరిగినట్లు కలెక్టర్ బృందానికి వివరించారు.