గిగ్ వర్కర్స్ కోసం తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి వర్కర్ కి రూ.5 లక్షల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, రూ.10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించనున్నట్లు స్వయంగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రకటించారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ గిగ్ వర్కర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారితో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గిగ్ వర్కర్ల వాహనాలపై ప్రయాణించారు. అనంతరం హైటెక్ సిటీలోని జయభేరి గ్రౌండ్లో నిర్వహించిన బహిరంగ సభకు హాజరయ్యారు.