ఇళ్లలో పూజలందుకుంటున్న తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రతిమ చిత్రానికి జీవం పోసిన ప్రఖ్యాత చిత్రకారుడు ఎస్.ఎం. శ్రీనివాసన్ (86) మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కోవిల్పట్టిలోని తన నివాసంలో గురువారం తుది శ్వాస విడిచారు. తిరుమల తిరుపతి దేవస్థానం 1970లో ప్రత్యేకం ఆహ్వానంతో గర్భగుడిలోని మూలవిరాట్టును నేరుగా వీక్షించి, స్వామివారి దివ్య రూపాన్ని తన కుంచెతో ఆయన చిత్రీకరించారు. ఆభరణాలతో అలంకరించిన స్వామివారి రూపం, ఆభరణాలు లేని నిరాడంబర రూపం.. ఇలా రెండు వేర్వేరు చిత్రాలను శ్రీనివాసన్ గీశారు.