పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. సుదీర్ఘ సముద్ర తీరం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రాష్ట్ర అభివృద్ధికి అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. విశాఖలో నిర్వహించిన సిఐఐ భాగస్వామ్య సదస్సు విజయవంతమైందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సదస్సు ద్వారా ఏపికి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని, 76 శాతం ఒప్పందాలు కార్యరూపం దాలుస్తున్నాయని ప్రభుత్వం వెల్లడించిందని చెప్పారు. ప్రధాని మోదీ చేపట్టిన కార్యక్రమాలతో వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవచ్చని విశ్వాసం వ్యక్తం చేశారు.