హైదరాబాద్ నగర నూతన పోలీసు కమిషనర్(సీపీ)గా మహేష్ భగవత్ బాధ్యతలు చేపట్టారు. ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయన ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తన ప్రాధాన్యతలను వెల్లడించారు. శాంతిభద్రతల పరిరక్షణ, మహిళా భద్రత, ట్రాఫిక్ నియంత్రణ అంశాలకు తమ బృందం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో అనుభవం ఉన్న అధికారులు ఎందరో ఉన్నారని, మేమందరం కలిసి టీమ్‌గా పని చేస్తామని పేర్కొన్నారు. తరచూ నేరాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటా మని… పీడీ యాక్ట్‌లు పెడతామని హెచ్చరించారు.