‘‘సమర్థ, సుస్థిర నాయకత్వం ఉంటే ఎలాంటి అద్భుతాలైనా సృష్టించవచ్చు. ప్రజలకు మంచి చేస్తే వారే మనల్ని ఆశీర్వదిస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న సానుకూల వాతావరణం వల్లే పారిశ్రామికవేత్తల్లో నమ్మకం ఏర్పడి పెట్టుబడులతో ముందుకొస్తున్నారు’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గతంలో హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా అభివృద్ధి చేశామని, ఇప్పుడు దాన్ని మించేలా నవ్యాంధ్ర రాజధాని అమరావతిని నిర్మిస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ‘‘ప్రపంచంలోనే ప్రత్యేక నగరంగా అత్యాధునిక రహదారులు, ప్రభుత్వ భవనాలు, పర్యావరణ హిత (గ్రీన్ గ్రోత్) నిర్మాణాలతో అమరావతి రూపుదిద్దుకుంటోంది.