శ్రీకాళహస్తి ఆలయ ప్రసాదాల తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నెయ్యి ఒలికిపడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన పోటు సిబ్బంది వెంటనే కేంద్రం నుంచి బయటకు వచ్చారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటల ధాటికి విద్యుత్ తీగలు కాలిపోయాయి. సిబ్బంది అప్రమత్తత, అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది.