ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించడంలో సీఎం చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రశంసించారు. పెట్టుబడులు పెట్టాలనుకునే పారిశ్రామికవేత్తల్లో విశ్వాసం కల్పించడంలో చంద్రబాబు ఎంతో సమర్థుడని పేర్కొన్నారు. ఆయన నాయకత్వంలో రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు వస్తున్నాయని, పారిశ్రామిక రంగం అభివృద్ధికి అనుకూలమైన విధానాలు అమలవుతున్నాయని చెప్పారు. ముఖ్యంగా Ease of Doing Business విధానాన్ని కేవలం వ్యాపార నిర్వహణ సౌలభ్యానికే పరిమితం చేయకుండా, Speed of Doing Business స్థాయికి తీసుకెళ్లడం అభినందనీయమన్నారు