ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులకు అత్యంత నమ్మకమైన ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. విశాఖపట్నంలో నిర్వహిస్తున్న CII Partnership Summit 2026లో ఆయన పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఏపీని కేవలం పెట్టుబడులు పెట్టే రాష్ట్రంగా కాకుండా, సొంత ప్రాంతంగా భావించి పరిశ్రమలను స్థాపించాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. పరిశ్రమల స్థాపన, ఆధునిక యంత్రాల కొనుగోలు, మౌలిక సదుపాయాల కల్పనతోనే పెట్టుబడుల బాధ్యత ముగిసిపోకూడదని అభిప్రాయపడ్డారు.

