ఆంధ్రప్రదేశ్‌కు సాంకేతిక రంగంలో మరో గుర్తింపు రాబోతోందని సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటర్ అమరావతిలో ఏర్పాటు కానుందని అన్నారు. వచ్చే ఫిబ్రవరిలో సౌత్ ఏషియాలోనే తొలి క్వాంటం కంప్యూటర్ను ప్రారంభించనున్నట్లు CII Partnership Summit 2026లో ప్రకటించారు. దేశంలో మేడ్ ఇన్ ఇండియా డ్రోన్లు ఇప్పటికే వివిధ రంగాల్లో పనిచేస్తున్నాయని, సాంకేతిక పరిజ్ఞానం, పరిశ్రమలు, నూతన ఆవిష్కరణలకు ఏపీ ప్రాధాన్యత ఇస్తోందని తెలియజేశారు.రాష్ట్రాన్ని సాంకేతికంగా, పారిశ్రామికంగా మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చంద్రబాబు స్పష్టం చేశారు.