మరో పదేళ్లలో ఏఐతో వైద్య రంగంలో అద్భుతాలు జరుగుతాయని ఆంథ్రోపిక్ సంస్థ సీఈఓ డారియో తాజాగా తెలిపారు. ‘క్యాన్సర్, ఆల్జైమర్స్, గుండె జబ్బులు, మానసిక రుగ్మతలు వంటివన్నీ కనుమరుగవుతాయి’ అని డారియో చెప్పారు. ‘ఏఐతో కరెక్ట్‌గా ప్లాన్ చేసుకుంటే అద్భుతాల శకానికి ఆహ్వానం పలకవచ్చు. వందల సంవత్సరాలుగా ఇబ్బంది పెడుతున్న సమస్యలను పరిష్కరించవచ్చు’ అని అన్నారు. గతంలో గూగుల్ ఏఐ విభాగం బాస్ డెమిస్ హసాబిస్ కూడా ఇదే కామెంట్ చేశారు. కొత్త ఔషధాలను వారాల్లోనే గుర్తించే శకం వస్తుందని చెప్పారు.