నిధుల దుర్వినియోగం, అవినీతి ఆరోపణల కేసులో 1996 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్. సంజయ్‌కు రాష్ట్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. అడిషనల్ డీజీపీ హోదాలో ఉన్న ఆయన సస్పెన్షన్‌ను ప్రభుత్వం మరోమారు పొడిగించింది. ఆయన వయోపరిమితి ప్రకారం రిటైరయ్యే 2027 మార్చి 31వ తేదీ వరకు లేదా క్రిమినల్ విచారణ ముగిసే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు.

