ఏపీలో వెబ్‌ల్యాండ్ డేటాబేస్ హ్యాకింగ్ ముఠా గుట్టు రట్టయింది. ఎన్ఐసీ అధికారి యూజర్ ఐడీ దొంగిలించి రికార్డులు మార్చినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. ఈ ఫోర్జరీ కేసులో నెట్‌వర్క్‌లోని నలుగురు నిందితులను సీఐడీ అరెస్టు చేసింది. ప్రకాశం జిల్లా దొనకొండలోని 6.55 ఎకరాల భూమికి సంబంధించిన వెబ్‌ల్యాండ్‌లో ఈ ముఠా అనధికార మార్పులు చేసింది. మ్యుటేషన్ ఉత్తర్వులు లేకుండానే వెబ్‌ల్యాండ్‌లో కొత్త పట్టాదారుల పేర్లు చేర్చింది.