ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు నిబంధనలకు సంబంధించి సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒక ప్రభుత్వ ఉద్యోగి 48 గంటలకు పై జ్యుడిషియల్ కస్టడిలో ఉంటే నిబంధనల ప్రకారం అతను సస్పెండ్ అయినట్లుగానే పరిగణించాల్సి ఉంటుందని ప్రత్యేకంగా ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బీహార్ కు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి బెయిల్ కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ విషయాన్ని ప్రస్తావించింది. ఆ తర్వాత ఆయనకు కల్పించిన పోస్టింగ్ కు సంబంధించి కూడా ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది.