రాజకీయ పార్టీల్లోకి ‘దిమాగీ నక్సల్స్’ (అర్బన్ నక్సల్స్) చొరబడ్డారంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అత్యంత ఘాటుగా స్పందించారు. సామాజిక మాధ్యమం వేదికగా ప్రధాని మోదీకి ప్రత్యక్ష సవాలు విసిరారు. “ప్రతిపక్షాలను నక్సల్స్‌తో పోల్చడం మోదీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. నిజమైన దేశద్రోహులు ఎవరో, విదేశీ శక్తుల చేతుల్లో ఎవరు కీలుబొమ్మలుగా మారారో తేల్చుకోవడానికి ప్రధాని మోదీ నాతో బహిరంగ చర్చకు రావాలి” అని రాహుల్ డిమాండ్ చేశారు.