నిషేధిత ఆస్తుల జాబితా నుంచి కొన్ని ప్లాట్లను తొలగించే అంశంపై హైకోర్టు ఆదేశాలను ధిక్కరించటంతో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డికి తెలంగాణ హైకోర్టు తీవ్ర షాక్ ఇచ్చింది. కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినట్లు నిర్ధారణ అవ్వడంతో జిల్లా కలెక్టర్‌కు 6 నెలల సాధారణ జైలు శిక్షతో పాటు రూ.2,000 జరిమానా విధిస్తూ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.ఉన్నత స్థానంలో అప్పీల్ చేసుకునేందుకు 4 వారాల వ్యవధిని కల్పించింది. ఈ కాలానికి శిక్ష అమలును కూడా నిలిపివేసింది.

