దీపావళి పండుగ సందర్భంగా హైదరాబాద్లోని చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో అమ్మవారి ఖజానా పేరుతో భక్తులకు ఉచితంగా వెండి నాణేలను పంపిణీ చేస్తున్నారు. నగరంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు, గుల్జార్ హౌస్ వరకు సుమారు 500 మీటర్ల మేర క్యూ లైన్లు ఏర్పడ్డాయి.ఈ నెల 11వ తేదీ వరకు భక్తులకు వెండి నాణేలను పంపిణీ చేయనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది.అమ్మవారి వెండి నాణెం ఇంటికి తీసుకెళ్తే సిరిసంపదలు వృద్ధి చెందుతాయని భక్తులు విశ్వసిస్తున్నారు.

