రూ.500 నోట్ల రద్దుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతిని అరికట్టేందుకు డిజిటల్ కరెన్సీని మరింతగా ప్రోత్సహించాలని సూచించారు. రూ.500 నోట్లను రద్దు చేసి, రూ.100, రూ.200 నోట్లు మాత్రమే చలామణిలో ఉండేలా చూడాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరుతున్నట్లు తెలిపారు. ఈ అంశంపై ప్రధానిని కోరుతూనే ఉంటానని స్పష్టం చేశారు.

