ఎన్నికల ఫలితాలు, రిగ్గింగ్ ఆరోపణలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. వైసీపీ చేస్తున్న ఆరోపణలను ప్రస్తావిస్తూ EVMలు, బ్యాలెట్ విధానాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. EVMల ద్వారా ఎన్నికలు నిర్వహించినప్పుడు వాటిని మానిప్యులేట్ చేశారని వైసీపీ నేతలు ఆరోపించారని, ఇప్పుడు బ్యాలెట్ బాక్సుల ద్వారా ఓటింగ్ నిర్వహిస్తే రిగ్గింగ్, దౌర్జన్యాలు జరిగాయని విమర్శిస్తున్నారని చంద్రబాబు అన్నారు. ఎన్నికలు ఏ విధానంలో నిర్వహించినా వైసీపీ ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు

