loader

ఆఫ్రికా దేశం సెనెగల్ తీరంలో వలసదారులతో వెళ్తున్న బోటు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కనీసం 21 మంది మరణించారని ఆ దేశ హోం మంత్రిత్వ శాఖ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రమాద సమయంలో బోటులో మొత్తం ఎంతమంది ఉన్నారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఘటనా ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్​ చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. రాజధాని డాకర్‌కు ఉత్తరాన ఉన్న కెబెమెర్ పట్టణ తీరంలో ఈ బోటు మునిగిపోయిందని తెలిపారు. సోమవారం సెనెగల్ హోం మంత్రి ఘటనా ప్రాంతాన్ని సందర్శించనున్నారని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON